Showing posts with label Rajendra Prasad. Show all posts
Showing posts with label Rajendra Prasad. Show all posts

Thursday, January 14, 2016

నాన్నకు ప్రేమతో - ఏంతో వేగం, కానీ అర్ధమౌతుందా ?

దర్శకుడు సుకుమార్ ఇంకొక సారి తన హీరో ని దెబ్బ తీశాడా ? ఈ ప్రశ్న  తప్పకుండా
తలెత్తుతుంది నాన్నకు ప్రేమతో సినిమా చూసిన వాళ్లకు.  శ్రీ వెంకటేశ్వర సిని చిత్ర వారి పెద్ద సినిమా, అత్తారింటికి దారేది తరువాత, డబ్బుకు వెనుకాడలేదు నిర్మాత, దర్శకుడు కూడా చాలా కష్ట పడ్డాడు ఈ సినిమాకి, కాని తారఖ్ కి తన 25వ సినిమా హిట్ ఇవ్వలెడెమొ.

తండ్రి పగని తీర్చిన ముగ్గురు కొడుకులు, మొత్తం లండన్ మరియు స్పెయిన్ నేపధ్యంలో ఈ సినిమా తీసారు నిర్మాతలు. సినిమా ఆద్యంతం ఉత్కంటతతొ నడుస్తుంది. కాని ఈ సినిమాని ఎంజాయ్ చెయ్యాలి అంటే టెక్నాలజీ పై కొంత అవగాహన ఉండాలి, అంతే  కాదు కొన్ని సీన్లు చూస్తుంటే, దర్శకుడు, నేనొక్కడినే నుంచి పెద్దగ నేర్చుకోలేదు అని తెలుస్తుంది.

సుకుమార్ లవ్ సినిమాలు బాగా తీస్తాడు, ఆర్య, 100% లవ్ ఒక ఉదాహరణ, నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో అతని క్రియేటివిటి కి అద్దం  పడతాయి, కాని హీరో కి హిట్ ఇవ్వలేవు, కారణం జనాలకు అంత సులభంగా అర్ధం కావు.  మహేష్ బాబు చెప్పినట్టుగా ఇవి టీవి లో ప్రదర్శిస్తే జనాలు బాగా రిసీవ్ చేసుకుంటారు.

తారఖ్ ఈ సినిమా కోసం చాలానే కష్ట పడ్డాడు, హెయిర్ స్టైల్ మొదలుకొని, గెట్ అప్ అంతా మార్చాడు, తెలుగు సినిమా హీరో ఇలా కూడా ఉంటాడా అని పించేలా దర్శకుడి మాటకి తల వంచాడు. డ్యాన్స్ లు అదర గొట్టాడు, నటన గురించి పెద్దగా మనం చెప్పా వలసినది ఏమి లేదు, ఆతను  సహజ నటుడు, ప్రతి సీన్ లో రాణించాడు.

రాఖుల్ ప్రీత్ సింగ్, ఈ చిత్రం లో తను అందాలు మాత్రమె కాదు నటన కూడా ప్రదర్సించగలను అని నిరూపించింది, కొంత ఇంప్రూవ్ మెంట్ కి అవకాశం ఉన్నా కూడా, ఈ సినిమాలో తనకి వచ్చిన అవకాశం చాలా బాగా
ఉపయోగించికున్నది .

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగా ఉన్నది, పాటల బాణీలు బాగా కుదిరాయి.. చిత్రీకరణ కూడా బాగా వచ్చింది. 

జగపతి బాబు, ప్రతి నాయకుడుగా చాల బాగా నటించాడు, క్యారక్టర్ నటుడుగా బాగా కుదుట బడ్డాడు, మన దర్శకులు వేరే బాషల నుంచి ఈ పాత్రలకు నటులను తెచ్చే ముందు, మన సీనియర్ నటులకు అవకాశం ఇవ్వగలిగితే బాగుంటుంది. రాజేంద్ర ప్రసాద్ తనకున్న పరిదిలో, తన కౌశల్యాన్ని ప్రదర్శించాడు. 

కమెడియన్స్, మహిళా నటులు (క్యారక్టర్ నటులు) లేరనే భావనే కలిగించలేదు దర్శకుడు. 



టూకీగా కథ: ఓక తండ్రి, ముగ్గురు కొడుకులు, టెర్మినల్ వ్యాధి తో చివరి రోజుల్లో ఉన్న తండ్రి
తన కథ ని మరియు తన పగని తన పిల్లల ముందు ఉంచుతాడు , మూడవ కుమారుడు అభిరామ్ తండ్రి పగని ఎలాగైనా సాధించాలని, విలన్ కూతుర్ని ప్రేమలో పడెయ్యాలని ప్రయత్నిస్తాడు. కథ మెలికలు తిరుగుతూ అభిరామ్, ఎలా తన తండ్రిని మోసం చేసిన కౌటిల్య ని పడగొడతాడు అనేదే కథ. ఈ కథ కు ఒక మూలం, ఇక్కడ  జరిగే ఒక పని వల్ల ఫలితం ఇంకెక్కడో ఉంటుంది, ఇంకొకటి, ఎక్కడి ఎమోషన్ అక్కడే తీర్చుకోవాలి.

ఈ సినిమాకి నా రేటింగ్ **** (కాని సినిమా జనాలకు నచ్చుతుందా ?)


all pictures used in this blog are taken from the net, copyright of the same rests with the respective owners.

Sunday, November 15, 2015

అఖిల్ - సిసింద్రీ సినిమా పేలలేదు

సిసింద్రీ సినిమా తో అరంగేట్రం చేసిన నాగార్జున చిన్న కొడుకు అఖిల్, "నాన్న నేను క్రికెట్ ఆడుతాను" అంటే ఆస్ట్రేలియా పంపి ఆట నేర్పించిన  తండ్రి, కొడుకు సిసిఎల్ దాటి రాణించక పోయే సరికి, చివరాకరికి ఆంధ్ర ప్రేక్షకుల పై వదిలిన రెండవ బాణం. 

మొదటి బాణమే ఇంకా సరిగ్గా పనిచేయట్లేదు అంటే, రెండవదైనా పనిచెయదా అని ఒక నమ్మకం (ఇటువంటిది  ఇంతకముందు కూడా జరిగింది రమేష్ బాబు, మహేష్ బాబు విషయంలో). కొత్త నిర్మాత, ప్రముఖ దర్శకుడు (ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలు దెబ్బ తిని వున్నాయి) వెరసి ఒక సోషియో ఫాంటసి చిత్రం. 

మన దర్శకులు సైంటిఫిక్/ సైకాలజీ  కధలు సినిమాలుగా మలిచేటప్పుడు, వీటిని ప్రేక్షకులకు ఎలా దగ్గరకు చేర్చాలి అన్నది ముందు నేర్చుకోవాలి (నేనొక్కడినే, 7 సెన్స్ , బ్రదర్స్ మొ॥) ఈ విషయంలో సింగీతం శ్రీనివాసరావు (పుష్పక విమానం, ఆదిత్య 369 మొ॥ ) గారి దగ్గర పాఠాలు నేర్చుకున్నా తప్పులేదు. 

ఇంగ్లీష్ సినిమా రీతిలో కధ, ఆఫ్రికా నేపద్యం, చెడగొట్టబడిన ఒక పెళ్లి, ప్రేమ, చాలా ఫైట్స్ , ఇంకా ఎన్నో పాటలు ఇవన్ని కలసి దానిలో కామెడీ రంగరించి తీయబడ్డ ఒక చిత్రం 'అఖిల్'. 

వి వి వినాయక్ సినిమాని త్వరగా ముగించాడు (110 ని), అయన పడ్డ కష్టం కధలో, కామెడి లో తప్ప నటన పై పెద్దగా శ్రద్ధ పెట్టిన దాఖలా అయితే లేదు. 

అఖిల్ కొత్త హీరో, ఇద్దరు నటులకు పుట్టిన ముద్దు బిడ్డ, అతని అన్న కు ఉన్న డైలాగు డెలివరి ఏ కోశానా ఇతనిలో కనపడదు (లిప్ సింక్ కూడా జాగ్రత్త పడలేదు), స్తేప్పులైతే  వేసాడు గాని, వాటి లో వెరైటి కనపడదు (నృత్య దర్శకుడి లోపమా?), ఫైట్స్ బాగున్నాయి, నటన చాలావరకు సూపర్ఫిషియల్ (ఇంకా చాలా శ్రద్ధ చూపించాలి, ఈ విషయంలో)
సాయెశా సైగల్ అందంగా, ఉండి చక్కగా నటించింది, కాస్ట్యూమ్స్ పై పెద్దగా దృష్టి పెట్టి నట్టు లేదు దర్శకుడు. హీరో కోసం తీసిన చిత్రం కాబట్టి, నటన కు స్కోప్ అంతంత మాత్రమే. డాన్స్ విషయంలో కొంత కష్ట పడాలి. 

మహేష్ మంజ్రేకర్, రాజేంద్రప్రసాద్, మేము ఉన్నాము అనిపించారు. హేమ బాగా లావెక్కి ఉన్నది. 

బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ జత కామెడి ని పండించారు, తనకున్న పరిధి లో జయప్రకాశ్ రెడ్డి కూడా మనల్ని నవ్విస్తాడు. 

పాటల చిత్రీకరణ స్పెయిన్ దేశం లో బాగా చేసారు. పాటలు వినసొంపుగా ఉన్నాయి, అక్కినేని నేనెక్కడుంటే పాట లో చాలా కష్టపడ్డాడు హీరో.  
పాట సెట్టింగ్ పై నిర్మాత ఖర్చు కి వెంకాదినట్లు లేదు, ఈ పాటలో కొద్ది సెకండ్స్ నాగార్జున దర్శనమిస్తాడు .

కధ టూకీగా: సూర్య గ్రహణ అనతరం వచ్చే మొదటి కిరణాల వేడి ని తట్టుకొనేందుకు, మన పూర్వీకులు తాయారు చేసిన ఒక ఖనిజ మిశ్రమాన్ని, భూమధ్య రేఖ లో ఉన్న ఒక ఆఫ్రికా దేశ తెగ సంరక్షణలో ఉంచుతారు. వారు దాన్ని 'జువా' అని పిలుస్తారు. దాన్ని కోన్ని శతాబ్దాలుగా కాపాడిన అ తెగ పై కొన్ని దుష్ట శక్తులు దాడి చేసి అది సంగ్రహించాలని చూస్తాయి. ఈ
సందర్భంగా తన పెళ్లి ఆగిన కారణంగా విదేశాల్లో ఉన్న హీరోయిన్ కిడ్నాప్ కాబడుతుంది, ఆమెను రక్షించబోయిన హీరో పడే ఇబ్బందులు, ఆ  'జువా' ని హీరో ఎలా కాపాడాడు అనేది మిగతా కధ

ఈ చిత్రానికి 2 నక్షత్రాలు ఇవ్వవచ్చు