'నేను శైలజ' కొత్త దర్శకుడు కిషోర్ తిరుమల మలిచిన ఒక మంచి చిత్రం. శ్రీ స్రవంతి మూవీస్
బ్యానర్ పై రవి కిశోర్ నిర్మించిన ఈ చిత్రం కొత్త సంవత్సర కానుకగా విడుదలై ప్రజలను ఆహ్లాద పరుస్తున్నది.
ఎమోషనల్ ఫ్యామిలి డ్రామా (కుటుంబ కధా చిత్రం) నేపధ్యం లో ఈ మద్య కాలంలో ఎంపిక చేసిన నటీ నటులను పొదుపుగా వాడుకున్న చిత్రంగా పరిగనించ వచ్చు. చిన్ననాటి జ్ఞాపకాలని ప్రేమగా మలిచి దానిలో మళ్ళా మలుపులో పెట్టి, దర్శకుడు తన ప్రతిభను చక్కగా ప్రదర్సించగలిగాడు
క్యారక్టర్ యాక్టర్లలో సత్యరాజ్ తన సత్తా చూపించాడు. నరేష్ నేను ఉన్నాను అనిపించినా, ప్రగతి మరియు రోహిణి వారి పాత్రలలో బాగా రాణించారు. ప్రదీప్ రావాల్ ని 'మహర్షి' పాత్రలో దర్శకుడు కొత్తగా కమెడియన్ రూపంలో చూపించి అతని ట్యాలంట్ ని బాగా వాడుకున్నాడు.
రామ్ కి ఈ మధ్య కాలంలో దెబ్బ మీద దెబ్బ తగిలి (వరుస పరాజయాలు) నిరుత్సాహంగా ఉన్న సమయంలో దొరికిన ఒక హిట్, ఈ చిత్రమ్. స్వంత బ్యానర్ పై పొదుపుగా తీసిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొంది, చిన్నగా ఫ్యామిలి ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. రామ్ తన నటనలో కొత్తదనం చూపక పోయినా గాని, మ్యానరిజమ్స్ మరియు చురుకుదనం తో
మెప్పించాడు
కీర్తి సురేష్ నటన లో ఇంకా బాగా అభివృద్ధి చెందాలి, అంత గొప్ప అందగత్తె కాక పోయినప్పటికీ, ఫరవాలేదు అనిపించింది. డ్యాన్సులు హావ భావాలు కొంత వరకు మేరుగుపరుచుకుంటే అవకాశాలు వస్తాయి.
ప్రదీప్ రావల్ కమేడియన్గా ఈ సినిమాకి చాలా రిలీఫ్ ని ఇచ్చాడు. తనకి ఇది ఒక కొత్త ఒరవడి. ముందు ముందు ఎలా ఈ కోణం మిగతా దర్శకులు వాడుకుంటారో వేచి చూడాలి.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం బాగానే ఉన్నది, శైలజ శైలజ పాట బాగా ఉన్నది.
టూకీగా కథ : హరి ఒక పబ్ లో డి జె, కనపడ్డ అమ్మాయిలందరికీ 'ఐ లవ్ యు' చెప్పే రకం, కారణం ఆరేళ్ళ వయసులో తన మొదటి లవ్ కి, 'ఐ లవ్ యు' చెప్పలేక పోవటం. తనకి అక్కో చెల్లో తెలియని ఒక కవల సోదరి, వీరిద్దరూ కుండ మార్పిడి మాదిరిగా ఒక అన్నా చెల్లి ని ప్రేమించడం, వారి ని గెలుచుకోవడానికి పడ్డ కష్టాలు, పెళ్లి, సంగీత్ , ఫ్యామిలి డ్రామా, విలనీ ఇవన్నీ మోతాదు మించ కుండా చక్కగా తీయబడ్డ ఒక కుటుంబ కథా చిత్రం 'నేను శైలజ'
నా రేటింగ్ 3.75 స్టార్స్
All pictures used in the blog are taken from the internet and the copyright rests with the respective owners.
I also saw the film on Sunday it is feel good film without boredom. Ram as usual very active with energy and also glamous and easy going role even though his love is denied by his lover,because of his genuine love for her. Heroin from non expressive attitude family has accepted her marriage with her near relative leaving loved boy friend.Songs are good especially title song sarcastically elevated the selfish of heroin in serious situation. Individually expressions of family members with hero their love and affection towards other members in the family especially towards heroin which recorded by hero with out their knowledge and the same was displayed before all the family members is superb.that is very convincing scene to make them(hero,heroin) couple at last minute cancelling her marriage with her near relative ,obeying her parents advice.it is a director cinema ,he maintains balance in every scene without losing its tempo.it is good film comparatively can be seen with family members.I agree with the reviewer 100%.I give 6 out of 10 marks.Hero is plus and heroin earns no negative marks,sathyaraj is also is plus as Telugu audience is accepting him as dignified parentwith integrity from mirchi cinema.
ReplyDelete