
మొదటి బాణమే ఇంకా సరిగ్గా పనిచేయట్లేదు అంటే, రెండవదైనా పనిచెయదా అని ఒక నమ్మకం (ఇటువంటిది ఇంతకముందు కూడా జరిగింది రమేష్ బాబు, మహేష్ బాబు విషయంలో). కొత్త నిర్మాత, ప్రముఖ దర్శకుడు (ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలు దెబ్బ తిని వున్నాయి) వెరసి ఒక సోషియో ఫాంటసి చిత్రం.
మన దర్శకులు సైంటిఫిక్/ సైకాలజీ కధలు సినిమాలుగా మలిచేటప్పుడు, వీటిని ప్రేక్షకులకు ఎలా దగ్గరకు చేర్చాలి అన్నది ముందు నేర్చుకోవాలి (నేనొక్కడినే, 7 సెన్స్ , బ్రదర్స్ మొ॥) ఈ విషయంలో సింగీతం శ్రీనివాసరావు (పుష్పక విమానం, ఆదిత్య 369 మొ॥ ) గారి దగ్గర పాఠాలు నేర్చుకున్నా తప్పులేదు.
ఇంగ్లీష్ సినిమా రీతిలో కధ, ఆఫ్రికా నేపద్యం, చెడగొట్టబడిన ఒక పెళ్లి, ప్రేమ, చాలా ఫైట్స్ , ఇంకా ఎన్నో పాటలు ఇవన్ని కలసి దానిలో కామెడీ రంగరించి తీయబడ్డ ఒక చిత్రం 'అఖిల్'.
వి వి వినాయక్ సినిమాని త్వరగా ముగించాడు (110 ని), అయన పడ్డ కష్టం కధలో, కామెడి లో తప్ప నటన పై పెద్దగా శ్రద్ధ పెట్టిన దాఖలా అయితే లేదు.
అఖిల్ కొత్త హీరో, ఇద్దరు నటులకు పుట్టిన ముద్దు బిడ్డ, అతని అన్న కు ఉన్న డైలాగు డెలివరి ఏ కోశానా ఇతనిలో కనపడదు (లిప్ సింక్ కూడా జాగ్రత్త పడలేదు), స్తేప్పులైతే వేసాడు గాని, వాటి లో వెరైటి కనపడదు (నృత్య దర్శకుడి లోపమా?), ఫైట్స్ బాగున్నాయి, నటన చాలావరకు సూపర్ఫిషియల్ (ఇంకా చాలా శ్రద్ధ చూపించాలి, ఈ విషయంలో)
సాయెశా సైగల్ అందంగా, ఉండి చక్కగా నటించింది, కాస్ట్యూమ్స్ పై పెద్దగా దృష్టి పెట్టి నట్టు లేదు దర్శకుడు. హీరో కోసం తీసిన చిత్రం కాబట్టి, నటన కు స్కోప్ అంతంత మాత్రమే. డాన్స్ విషయంలో కొంత కష్ట పడాలి.
బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ జత కామెడి ని పండించారు, తనకున్న పరిధి లో జయప్రకాశ్ రెడ్డి కూడా మనల్ని నవ్విస్తాడు.


ఈ చిత్రానికి 2 నక్షత్రాలు ఇవ్వవచ్చు
No comments:
Post a Comment