దర్శకుడు సుకుమార్ ఇంకొక సారి తన హీరో ని దెబ్బ తీశాడా ? ఈ ప్రశ్న తప్పకుండా
తలెత్తుతుంది నాన్నకు ప్రేమతో సినిమా చూసిన వాళ్లకు. శ్రీ వెంకటేశ్వర సిని చిత్ర వారి పెద్ద సినిమా, అత్తారింటికి దారేది తరువాత, డబ్బుకు వెనుకాడలేదు నిర్మాత, దర్శకుడు కూడా చాలా కష్ట పడ్డాడు ఈ సినిమాకి, కాని తారఖ్ కి తన 25వ సినిమా హిట్ ఇవ్వలెడెమొ.
తండ్రి పగని తీర్చిన ముగ్గురు కొడుకులు, మొత్తం లండన్ మరియు స్పెయిన్ నేపధ్యంలో ఈ సినిమా తీసారు నిర్మాతలు. సినిమా ఆద్యంతం ఉత్కంటతతొ నడుస్తుంది. కాని ఈ సినిమాని ఎంజాయ్ చెయ్యాలి అంటే టెక్నాలజీ పై కొంత అవగాహన ఉండాలి, అంతే కాదు కొన్ని సీన్లు చూస్తుంటే, దర్శకుడు, నేనొక్కడినే నుంచి పెద్దగ నేర్చుకోలేదు అని తెలుస్తుంది.
సుకుమార్ లవ్ సినిమాలు బాగా తీస్తాడు, ఆర్య, 100% లవ్ ఒక ఉదాహరణ, నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో అతని క్రియేటివిటి కి అద్దం పడతాయి, కాని హీరో కి హిట్ ఇవ్వలేవు, కారణం జనాలకు అంత సులభంగా అర్ధం కావు. మహేష్ బాబు చెప్పినట్టుగా ఇవి టీవి లో ప్రదర్శిస్తే జనాలు బాగా రిసీవ్ చేసుకుంటారు.
తారఖ్ ఈ సినిమా కోసం చాలానే కష్ట పడ్డాడు, హెయిర్ స్టైల్ మొదలుకొని, గెట్ అప్ అంతా మార్చాడు, తెలుగు సినిమా హీరో ఇలా కూడా ఉంటాడా అని పించేలా దర్శకుడి మాటకి తల వంచాడు. డ్యాన్స్ లు అదర గొట్టాడు, నటన గురించి పెద్దగా మనం చెప్పా వలసినది ఏమి లేదు, ఆతను సహజ నటుడు, ప్రతి సీన్ లో రాణించాడు.
రాఖుల్ ప్రీత్ సింగ్, ఈ చిత్రం లో తను అందాలు మాత్రమె కాదు నటన కూడా ప్రదర్సించగలను అని నిరూపించింది, కొంత ఇంప్రూవ్ మెంట్ కి అవకాశం ఉన్నా కూడా, ఈ సినిమాలో తనకి వచ్చిన అవకాశం చాలా బాగా
ఉపయోగించికున్నది .
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగా ఉన్నది, పాటల బాణీలు బాగా కుదిరాయి.. చిత్రీకరణ కూడా బాగా వచ్చింది.
జగపతి బాబు, ప్రతి నాయకుడుగా చాల బాగా నటించాడు, క్యారక్టర్ నటుడుగా బాగా కుదుట బడ్డాడు, మన దర్శకులు వేరే బాషల నుంచి ఈ పాత్రలకు నటులను తెచ్చే ముందు, మన సీనియర్ నటులకు అవకాశం ఇవ్వగలిగితే బాగుంటుంది. రాజేంద్ర ప్రసాద్ తనకున్న పరిదిలో, తన కౌశల్యాన్ని ప్రదర్శించాడు.
కమెడియన్స్, మహిళా నటులు (క్యారక్టర్ నటులు) లేరనే భావనే కలిగించలేదు దర్శకుడు.
ఈ సినిమాకి నా రేటింగ్ **** (కాని సినిమా జనాలకు నచ్చుతుందా ?)
all pictures used in this blog are taken from the net, copyright of the same rests with the respective owners.
No comments:
Post a Comment