ప్రాచీన కాలంలో సుదూర ప్రాంతములో ఒక తత్వ వేత్త మరియు అయన శిష్యుడు ఉండేవాళ్ళు. ఒకానొక ప్రయాణంలో వారిద్దరూ దూరంగా ఒక పూరిల్లు చూసారు. ఆ ఇంటికి దగ్గరకు వచ్చేప్పటికి దానిలో నివసిస్తున్న ఒక పేద కుటుంబం వారికి కనిపించింది.
చుట్టుపక్కల ఎటువంటి జన సంచారం లేని ప్రదేశంలో ముగ్గురు పిల్లలతో ఆ పేద దంపతులు ఒక దైన్యమైన జీవితం గడపడం చూసారు, దగ్గరలో ఎటువంటి వ్యవసాయం కూడా కనిపించలేదు. వారితో ఈ తత్వ వేత్త మరియు శిష్యుడు కొంత సమయం గడిపారు. అప్పుడు తత్వ వేత్త ఆ వ్యక్తీ తో సంభాషించ సాగాడు
"ఈ చుట్టూ పక్కల ఏమి లేదు, మీ జీవనం ఇక్కడ ఎలా సాగుతున్నది" అని అడిగాడు గురువు
"ఆ ఆవు ని చూడండి, అదే మమ్మల్ని బతికిస్తున్నది" అని బదులిచ్చాడు అ కుటుంబ పెద్ద, " అది మాకు పాలిస్తుంది, దానితో మేము పెరుగు కూడా తయారు చేసుకుంటాము, మాకు మిగలగా వచ్చిన దానితో దూరంగా ఉన్న గ్రామానికి వెళ్లి అవి అమ్మి,
వాటితో సరుకులు కొని తెచ్చు కుంటాము, ఇదే మా జీవన విధానం "
వారి ఆతిధ్యానికి కృతఙ్ఞతలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు గురు శిష్యులు. ఆ ఇంటి నుంచి దూరంగా ఉన్న మలుపు వద్ద ఆగి తత్వ వేత్త తన శిష్యుడికి ఇలా పురమాయించారు " నువ్వు వెనక్కి వెళ్ళు, ఆ ఇంట్లో ఉన్న ఆవు ని తీసుకొని రా, ఈ కొండ పై నుంచి దానిని తోసేయ్యి"
ఈ ఎదురు చూడని పురమాయింపుతో దిక్కుతోచని శిష్యుడు అవాక్కయ్యాడు, " ఈ పని నేను ఎలా చెయ్యగలను గురూజీ, మరీ ఇంత కృతగ్ణత నా , వారి దగ్గర ఉన్నది ఆ ఆవు ఒక్కటే, దానిని ఎలా కొండ మీద నుంచి తోసేయ్యమంటారు " అని అడిగాడు
కాని బదులుగా, తత్వవేత్త " నేను చెప్పిన పని చెయ్యి, ఆవు ని తీసుకు వచ్చి కొండ మీద నుంచి తోసేయ్యి " అని తిరిగి పురమాయించాడు.
గురువు గారికి ఎదురు చెప్పలేక పూర్తీ అయిష్టతతో శిష్యుడు, గురువు చెప్పిన పని చెయ్యటానికి బయల్దేరాడు
తిరిగి ఇంటి వద్దకు వచ్చిన శిష్యుడు, నిశ్శబ్దంగా ఆవుని తీసుకొని, కొండ చెరియ వద్దకు చేరి, దానిని తోసివేసాడు. కొండ పై నుంచి కింద పడ్డ ఆ ఆవు, చనిపోయింది.
సంవత్సరాలు గడిచాయి , ఈ సంఘటన కాని దానికి సంభందించిన బాధ కాని మరువలేని శిష్యుడు ఎప్పుడు పశ్చాత్తాపం తో బాధ పడేవాడు. వసంత ఋతువు లో ఒక రోజు, పశాత్తపంతో కుమల లేక, గురువు గారి దగ్గ్గర సెలవు తీసుకొని, ఆ పూరింటికి బయలు దేరాడు శిష్యుడు. ఆ పేద కుటుంబం ఎలా ఉన్నదో, ఎ స్తితి లో ఉన్నారో అనే ఆలోచన అతన్ని వేదిస్తూనే ఉన్నది. వీలయితే వారిని కలసి వారికి ఏదన్నా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు శిష్యుడు .
ఏదైతే మలుపు దగ్గర గురువు గారు అతనికి పని పురమాయించారొ అక్కడికి రాగానే, ఆశ్చర్య పడటం అతని వంతైనది. పూరిల్లు ఉండవలసిన ప్రదేశంలో ఒక విశాలమైన సుందరమైన ఒక భవంతి కనిపించింది, ఇంటిచుట్టూ వృక్షాలు, సెలయేళ్ళు, ఎన్నో సౌకర్యాలతో ఆ ఇల్లు కనిపించింది.
ఇదంతా చూసిన శిష్యుడికి దిక్కు తోచలేదు, తప్పకుండా, ఆ కుటుంబం ఎ పట్టణం లోనో బిక్షాటన చేసుకొని బతుకుతుంటారు, ఎవరో ఆ స్తలాన్ని తీసుకొని ఈ భవంతి కట్టుకున్నారు అనుకోని, ఇంత దూరం వచ్చాము కదా, వారినే అడుగుదాము అని ఆ ఇంటి వద్దకు వచ్చాడు శిష్యుడు
ఇంటి దగ్గరకు వెళ్లి అక్కడ కనిపించిన యుక్త వయసులోని ముగ్గురు పిల్లలతో ఒకర్ని పక్కకు పిలిచి అడిగాడు " ఇక్కడ
ఇంతకూ ముందు ఒక కుటుంబం ఉండేది ముగ్గురు పిల్లలు ఉండే వాళ్ళు" అన్నాడు శిష్యుడు
దానికి బదులుగా ఆ కుర్రాడు " మీరు చూస్తున్నది ఆ కుటుంబాన్నే, అదిగో అక్కడ ఉన్నారు మా నాన్న గారు "
ఏమి అర్ధం కాని శిష్యుడు ఆ ఇంటి పెద్ద దగ్గరకు వచ్చాడు, " అయ్యా కొన్ని సంవత్సరాల ముందు మా గురువు గారితో కలసి మీ ఇంటికి వచ్చాము, అప్పుడు మీరు చాలా దైన్య స్తితిలో ఉన్నారు, ఎలా మీరు ఈ స్తితికి వచ్చారు" అని అడిగాడు
చిరునవ్వుతో ఆ ఇంటి పెద్ద ఇలా సమాధానం ఇచ్చాడు " ఆ రోజుల్లో మా వద్ద ఒక ఆవు ఉండేది, అది మెత కోసం వెళ్లి, కొండ పై నుంచి పడి చనిపోయినది, ఆ తరువాత ఏమి చెయ్యాల అని సతమత మైన మేము, మాకు తెలియ కుండానే ,మాలోనే దాగి ఉన్న ఇతర నైపుణ్యాలతో, ఈ రోజు ఈ స్తితికి వచ్చాము"
ఈ కధ ద్వారా మనకి అర్ధమయ్యేది ఏమిటంటే, మనందరిలో భాందవ్యాలు అనే ప్రగతి నిరోధక అంశాలు ఉంటాయి, వాటి వల్ల మనం ముందుకు సాగలేము, ఎప్పుడైతే ఆ 'ఆవు' వంటి ఆ నిరోదకాలను మనం కొండ మీద నుంచి తోసి వెయ్యగాలమో అప్పుడే మనం ప్రగతి సాధించగలం
మీ మనసులో కూడా ఒక ' ఆవు' (ప్రగతి నిరోధకం, మనశ్శంక) ఉందా ?,
వెంటనే దానిని కొండ పైనుంచి తోసివేయ్యండి, మీరు జయించగలరు
(ఇంటర్నెట్ లో వచ్చిన ఒక ఇంగ్లీష్ కధ కి తెలుగు అనువాదం)
No comments:
Post a Comment