Tuesday, October 8, 2013

Song on present state of affairs in Andhra Pradesh, my home state

నీ బిడ్డ కోసం కల గన్నవా సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
మేమంత నీ బిడ్డలం కాదా ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
రెండు సార్లు నీ పార్టీకి ఓట్లెసి గెలిపించినాం ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
మా ఎంపీల దన్ను తొ చేసావు దోపిడి ఈ దేశాన్ని సొనియమ్మో, అమ్మో సొనియమ్మో

మా పెద్దొల్లు చెప్పారు తెలుగు మీ ఇటలీయన్ అంత తీపని, ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
మా అమయాక తెలుగు జనం నమ్మారు అదే నిజం కాబోలు అని, ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
నువ్వు ఇటలీ మేము తెలుగు ఆహ కుదిరింది మంచి లింకు అని, ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
ఆడావుగదా మహా తల్లి, ఓ ఆట మా తెలుగు వాళ్ళ బ్రతుకులతో ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో

బాశారు అశువులు, మా తెలుగు బిడ్డలు వెయ్యకు మించి, ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
వేశావు కమీటులు లెక్కకు మించి, ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
కాని ఏ కమిటి చెప్పింది మా బతుకులతో ఆడమని, ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
తొక్కావు తుంగలో శ్రీ క్రిష్న కమిటీ నివేదికని ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో

ఎక్కారు రోడ్డు పై మా ఆడవాళ్ళు, మా చంటి బిడ్డలు ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
వీధికేక్కారు మా చదువుకునె బిడ్డలు, ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
ససేమిరా అన్నారు మా ఉద్యోగ సొదరులు   ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
మా కలల మాటెమిటీ ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో

నా బిడ్డకు నేను గన్న కలే ముఖ్యం అన్నావు ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
మీ బిడ్డలు, మీ కలలు ఎటు పొతే నా కేమిటి, అన్నావు ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
మీ అత్త ఇందిరమ్మ నమ్మింది మేమంతా ఒకటిగా బతకాలని ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
అత్తా లేదు దుత్తా లేదు నా మాటె ఇక పై చెల్లు అన్నావు ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో

డూడూ బసవన్నలు మా మంత్రులు, ఎంపీలు ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
ఆడారు నీ మాటకు నాట్యం, చేసారు నువ్వు చెయమన్నదల్లా, ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
పాపం చూసారు ఈ రోజు, ప్రజా ఆగ్రహం   ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
ఇల్లు ఎక్కడొ, వాళ్ళు ఎక్కడో దిక్కు తొసక ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో

మా చంద్రన్న, జగనన్న తిట్టుకున్నరు నువ్వేంత నువ్వేంత ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
మా కిరణన్న ఎగరేసిండు తిరుగుబాటు జెండా ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
నీ కాడ తోక ఊపిన సత్తెన్న పెట్టిండు పోలీసుల్ని ఇంటికి కాపలా ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
ఈ నాయకుల్ని నమ్మిన మా బతుకుల్ని కాలరాయకె ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో

మాది తెలుగు, నీది ఇటాలి, బాషలు రెండు గొప్పవే తల్లి ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
చెయవే మా బతుకులు బాగు బాగు ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
విడదీసి న్యాయం చేస్తవో, కలిపుంచి బాగు పరుస్తవో ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో
కాని చూడకే తెలుగోడి కోపాన్ని, బగ్గుమంటది నీ  కాంగ్రేస్సు ఓ సొనియమ్మో, అమ్మో సొనియమ్మో






No comments:

Post a Comment