Tuesday, October 8, 2013

ఆంధ్రోడి గోడు

అరవయ్యెల్ల కింద వచ్చింది మొదటి తెలుగు రాష్ట్రం
మూడెల్లలొ కలిపారు మరో పది జిల్లాలు, అయ్యిందది ఆంధ్ర ప్రదేశం
మరో పదమూడు ఎళ్ళకు పుట్టింది ఒక ముసలం
మర్రి చెన్నన్న కావలన్నాడు ప్రత్యేక రాష్ట్రం

ముల్కీ రూల్స్ అన్నారు, చల్లార్చారు ఒక సెగ
రగిలింది ఇంకోక మంట, వద్దు వద్దు ముల్కీ, కావలి మాకు మా ప్రత్యేక ఆంధ్రా
తెచ్చింది ఇందిరమ్మ జోనల్ ఫార్మూల, అనింది కలిసి ఉండరా తెలుగొడా అని
సద్దు మణిగింది, దేశమంతా తూ అన్న, వేశాడు ముద్ర తెలుగోడు, ఇందిరమ్మ మేమంతా నీ వెంటే

రామారావు అంట, రంగులోడంట, ఆత్మాభిమానం అన్నాడు, చూరగొన్నడు తెలుగోడి మదిని
ఒరే పటేల, పట్వారి చెల్లింది మీ కాలం, పొండిరా మీ ఇంటికి అన్నాడు ఎంటివోడు
ఊపిరి పీల్చారు సన్న జనం తెలంగాణా అంతటా, దొరకెమో రగిలింది ముడ్డి కింద మంట
కడుపు మంట తోటి ఉన్నాడు దొర, కాశాడు రాదా నాకు టైము అని

తోశాడు పిల్లని, పదవిని ఇచ్చిన మామని, చాలింక నీ పాలన, చూడు నేను చేస్తాను పాలన
ఇవ్వలేదు ఈ చంద్రుడు అ చంద్రుడికి పదవి, కోపమొచ్చింది దొరకి, అన్నాడు, చూడు నా తడాఖా
ఎత్తాడు జెండా, అన్నాడు కావాలి మా తెలంగాణ, రగిల్చాడు కొత్త మంట
నమ్మారు జనాలు తియ్యని మాటలు, అనుకొన్నారు ఆంధ్రోడు దొంగ అని

మా పదవులు, మా భూములు, మా నీళ్ళు అన్ని దోచేశారు వలస వచ్చిన ఆంధ్రోడు
వాడు పోతే అంతా మనదేనంటా, బాగు పడును మన బతుకులు ఇక ముందంటా
కసాయి ని నమ్మిన గొర్రె ఒలె, అన్నారు నా ప్రాణం నీదన్న, ఎంత మందిమైనా చస్తాము
కావాలన్న మన పాలన, మన రాష్ట్రము చూడాలన్న సుఖములను

నడిపాడు కేసీఅర్ పుష్కర పోరాటము, నడిచాడు వెయ్యి మంది శవాల పై
తొడయ్యింది సొనియా తన బిడ్డ బాగు కోసం, మరిచింది తన అత్త మాట, ఇచ్చింది తెలంగాణ
ఎడ్చాడు ఆంధ్రోడు ఇదెక్కడి న్యాయం, నే పడ్డ కష్టం, నా బతుకు అయనే బుగ్గి
వోట్లేసిన పాపానికి జరిగింది సరియైన శాస్తి,  రోడ్డెక్కాడు న్యాయం, న్యాయం అని

నమ్మిన నాయకుడు, రాలేదు అక్కరకి, ఇక పై ఎవర్ని నమ్మలో తెలియని దుస్తితి
దేవున్ని మొక్కుదాం అంటే లేక పొయె బస్సులు, చేద్దాం పని అంటే బందులే బందులు
దిగమింగాడు కష్టాలన్ని, ఉంచమన్నాడు రాష్ట్రాన్ని సమైఖ్యంగా
ఉన్నారా ఎవరన్న వీడి గోడు వినా, అంతా అయిపొయిందా తెలుగోడి సఖ్యత

No comments:

Post a Comment