Friday, October 23, 2015

బ్రూస్లీ ద ఫైటర్ - కి ఏమయ్యింది

శ్రీను వైట్ల దర్శకత్వంలో డి వి వి దానయ్య గారి నిర్మాణతలో విడుదలైన రామ్ చరణ్ తేజ్ బ్రూస్లీ ద ఫైటర్. సినిమా సరదాగా నడచినప్పటికి ఏదో అసంతృప్తి , అందుకే కాబోలు ఈ సినిమా ప్రజల మనస్సు కి నప్పక, ఆవరేజ్ టాక్ తో నడుస్తున్నది 
 ఈ సినిమా

చెన్నై లాంటి ప్రదేశంలో ఈ సినిమా కొంత రుద్రమదేవి చేతిలో దెబ్బతిన్నది అని చెప్పవచ్చు. నేను ఈ సినిమా 6 వ రోజు చూడడం జరిగింది మొదటి 5 రోజులు రెండు ఆటలు వేసిన ఈ సినిమా 6వ రోజుకి ఒక్క ఆట చేయబడ్డది, పండుగ సెలవలు వల్ల హాలు బాల్కాని నిండినప్పటికి ప్రేక్షకుల స్పందన అంతంత మాత్రమె. 

శ్రీను వైట్ల మరియు రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ , చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్ ఏంతో ఆశలు పెంచాయి ప్రేక్షకుల మదిలో, శ్రీను వైట్ల తన ట్రేడ్ మార్క్ హాస్యాన్ని కొంత పాళ్ళు తగ్గించి, ఫైట్స్ కి ఎక్కువ ప్రాదాన్యత ఇచ్చినప్పటికీ, క్లైమాక్స్ ఫైట్ తప్పించి వేరే ఏది అలరించే లా లేదు. 

తమన్ అందించిన కొన్ని బాణీలు బాగున్నాయి, పాటల చిత్రీకరణ ఎదురుచూసిన మాదిరిగా లేదు. 'రియా' మరియు  'లేచలో' పాట చిత్రీకరణ స్పెయిన్ మరియు థాయిలాండ్ లో మంచి లోకేషన్స్ లో జరిగింది హైదరాబాదు లో వేసిన పాటల సెట్టింగులు కొంత లో బడ్జెట్ వ్యవహారంగా ఉన్నాయి. అన్ని పాటల్లో రామ్ చరణ్ తేజ్ పడ్డ కష్టం బాగా కనిపిస్తున్నది . 

రకుల్ ప్రీత్ సింగ్ తన వరకు నటన బాగా చేసినది. ఆ అమ్మాయి అందచందాలను దర్శకుడు శ్రీను వైట్ల యువ ప్రేక్షకుల మదిలో కలవార పరిచే విదంగా చిత్రీకరించాడు. నా లాంటి వయసు
మళ్ళిన వాళ్లకు 'లెగ్ షో ' కొంచం ఇబ్బందిగా ఉన్న కూడా, యువత కు మనోరంజకరంగా ఉంటుంది.

రావు రమేశ్, తనికెళ్ళ భరణి తమ పరిదిలో బాగా నటించారు. మిగతా నటులు నాదియా , కృతి కర్బందా , ఆలీ, వెన్నెల కిషోర్ , జయప్రకాష్ రెడ్డి (ద్విపాత్రాభినయం), షాయాజీ షిండే, ముకెశ్ రిషి మిగతా నటులను దర్శకుడు బాగానే ఉపయోగించుకున్నాడు. 

శ్రీను వైట్ల సినిమాలో బ్రహ్మానందం తప్పని సరి.  నటన కు పెద్దగా ఆస్కారం లేని ఒక పాత్ర, తనని వాడుకోవాలి కాబట్టి, ఒక సీన్ లో కోతి హావభావాలు పిల్లల్ని నవ్వించెదుకు బాగా ఉపయోగ పడ్డాయి. మిగతా సినిమాల్లో మాదిరి "చించేసాడు" అని చెప్పుకొనే పాత్ర మాత్రం కాదు. విలన్ ని ఎక్సపోజ్ చేసే సీన్ లు మాత్రం బాగా చేసాడు. 

ముఖ్య  విలన్ గా అరుణ్ విజయ్ బాగా నటించాడు, సంపత్  రాజ్, అతని సెక్రటరీగా పోసాని కృష్ణ మురళి, పృధ్వీ మేము ఉన్నాము అని వారి వారి పాత్రలు నటించేసారు. 

 రామ్ చరణ్ తేజ్ ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు, నటన కూడా బాగా చేసాడు అనే చెప్పాలి. డాన్స్ విషయంలో అది స్ప్రష్టంగా కనిపిస్తుంది, ఫైట్స్ చాల ఎక్కువ కాని, బడ్జెట్ లోపం బాగా కనిపిస్తుంది . 

శ్రీను వైట్ల ఈ సినిమాలో చాలా వరకు ఫ్యామిలి డ్రామా పైనే దృష్టి పెట్టి హాస్యాన్ని తగ్గించాడనే చెప్పాలి (ఆగడు ఫైల్యూర్ ఒక కారణం అయ్యి ఉండవచ్చు). 'ఎలాగెలగా' డైలాగ్ ని బాగానే పండించాడు. రామ్ చరణ్ తేజ్ ని ఎమోషనల్ సీన్స్ లో బాగా నటింప చేసాడు. బడ్జెట్ లోనే సినిమా ముగించినప్పటికి, సినిమా ని ప్రేక్షకులకు పూర్తీ సంతృప్తి ఇచ్చే రకంగా తియ్యలేదు అనే చెప్పాలి. సినిమా అంటే లాజిక్ చూడకూడదు అంటారు, కాని హైదరాబాదు నుండి షిర్ది కి వెళుతున్న కార్లో నుంచి బందిన్చాపడ్డ వాళ్ళు కొద్ది సేపట్లో ఒక షిప్పు ఎక్కడం అనే సీన్ మాత్రం లాజిక్ పదానికే లాజిక్ లేకుండా చేసింది.  

కధ టూకీగ: ఇద్దరు బిడ్డలకు మంచి విద్య ఇప్పించలేని ఒక మధ్య తరగతి తండ్రి బరువు తగ్గించాడాని కోసం, హీరో తన చదువును తక్కువ చేసుకొని తన అక్కను కలెక్టర్ చెయ్యాలనే కోరికతో స్టంట్ మాన్ గా చేరుతాడు. ఒక అమ్మాయిని రక్షించేందుకు జరిగిన సీన్ లో పోలీస్ డ్రెస్సు లో హీరోయిన్ (రియా) కి కనపడటం, ఆ అమ్మాయి, ఆ సీన్ ని ఫోన్ లో వీడియో తీసి ఫేస్బుక్ లో పెట్టడం, రియా ని నిలదీయడానికి వాడు, ఆమె పై మనసు పారేసుకోవడం, తన తండ్రి 25 సంవత్సరాలుగా పని చేస్తున్న కంపెనీ యజమాని ఒక దుర్మార్గుడు అని తెలుసుకొని, అతని ఆట కట్టించడం. 

ఈ సినిమా కు 3 (త్రీ) స్టార్ రేటింగ్ ఇచ్చాను 


ఈ బ్లాగ్ లోని ఛాయా చిత్రాల హక్కులు వాటి యజమానుల వి అయ్యి ఉన్నాయి 

No comments:

Post a Comment