మన దైనిక జీవితంలో ఇప్పుడు వాట్సాప్ లేకుండా ఊహించలేని పరిస్తితి వచ్చింది అంటే అసలు అతిశయోక్తి కాదు, దాని వాడకం, ఉపయోగాలు తెలుసుకొనే ముందు, దాని చరిత్ర కొంత తెలుసు కుందాం.
వాట్సాప్ 2009 సంవత్సరములో ప్రారంభించబడి మొట్టమొదటి సారిగా నవంబర్ మాసంలో ఆపిల్ ఫోన్ లో
ఉపయోగించ బడినది. మొదట ఫ్రీ (ఉచితం ) గా ఉన్న ఈ ఆప్ వాడకందారిని గుర్తించడం కోసం (వెరిఫికేషన్ ) అయ్యె ఖర్చులు రాబాట్టు కోవడం కోసం 'పెయిడ్' (కొనుగోలు) ఆప్ గా మార్చడం జరిగింది. జనవరి 2010 లో, ఈ ఆప్ బ్లాక్బెర్రి ఫోన్ లో కూడా లబింపచేయ బడినది . 2013 ఫిభ్రవరి మాసంలో 20 కోట్ల మంది వినియోగదారుల సంఖ్య చేరుకున్న వాట్సాప్ అతి తక్కువ సమయంలో రాకెట్ వేగంతో డిశంబర్ మాసానికి 40 కోట్ల వినియోగదారుల సంఖ్య చేరుకున్నది . ఫేసబుక్ కంపెని, 'కౌం అండ్ అక్టన్' చే స్తాపించ బడ్డ వాట్సాప్ కంపెని ని రూ.1,19,000 కోట్లకి కి కొనుగోలు చేసే సమయానికి ఈ వాడకం దారుల సంఖ్య 50 కోట్లకు చేరుకున్నది.
ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే , భారత దేశం లో వాట్సాప్ వినియోగదారులు ప్రపంచం సంఖ్య తో పోటి పడుతూనే ఒక కొత్త వరవడిని సృష్టించారు. మన వాళ్ళకు బాతాఖానీ వేయడం అంటే బలే ఇష్టం, అది ఎస్ ఎం ఎస్ ఖర్చు లేకుండా ఫ్రీగా చాటింగ్ చేసుకోవడం అంటే, అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్టే మరి. వాట్సాప్ వాడకం మన దేశంలో ఎంత బాగా అల్లుకొని పోయిందంటే, ప్రపంచ వాట్సాప్ వాడకం దారుల సంఖ్య లో మన వారి శాతం 9-10% ఉంటుంది , భారతీయ సంతతి ని కలుపుకొంటే అది 12% వరకు ఉంటుంది. భారత దేశంలో ఎక్కువ మంది వినియోగదారులు ఆండ్రాయిడ్ ఫోన్ లను వాడుతారు, ఇప్పటి వరకు వాట్సాప్ ఈ తరహ వాడకందారులకు ఎటువంటి చార్జీలను విధించలేదు, ముందు ముందు ఒక వేళ చార్జీ విధిస్తే ఎంత మంది ఈ వాట్సాప్ ని వదిలేస్తారొ చూడాలి మరి?
'ఈ రోజు మనము అందరం వాట్సాప్ కి బానిసలము అయ్యాము అంటే అతిశయోక్తి లేదేమో . ఒకప్పుడు ఒక ఈ మెయిల్ పంపించి, దాని జవాబు కోసం ఆశగా ఎదురు చూసే వాళ్ళము. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యుగంలో ఈ వాట్సాప్ కి మనం ఎంతగా అలవాటు పడ్డాము అంటే ఒక మెస్సేజ్ పంపించి, ఎప్పుడు ఒక 'టిక్కు రెండు 'టిక్కు లు గా మారుతుందా , అది తిరిగి 'నీలం రంగు గా మారుతుందా అని చేతిలో ఉన్న ఫోన్ ని అలాగే చూస్తుంటాము. 'బ్లూ రంగులోకి మారిన వెంటనే , హమ్మయ్య అని ఒక నిట్టూర్పు, దాని తరువాత తిరిగి జవాబు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూపు, ఇది మన పరిస్తితి.
ఈ బ్లూ టిక్కులు చాలా మందిని ఇబ్బందుల్లో పడేస్తున్నాయి, ఎందుకంటే మనం చూసాము అని ఎదుటి వాడికి తెలిసినప్పుడు , బొంకే అవకాశం చేజారి పోతుంది. కష్టాలు వస్తే కట్టగట్టుకొని వస్తాయి అంటారు, అలాగే, ఇంకొక ఇబ్బంది కూడా ఉందండోయ్, అదేమిటయ్యా అంటే, 'లాస్ట్ సీన్ (చివరి సారిగా మీరు వాట్సాప్ ని చూసిన సమయము) అని ఒక సమయం (టైమ్) చూపిస్తుంది, మనం మన మిత్రుడి సందేశాలను చూస్తున్నపుడు , అలాగే వాళ్ళు మన సందేశాలను చూస్తున్నపుడు. ఈ సదుపాయాన్ని మనం కావాలి అంటే 'ఆఫ్ (నిలిపి) ' చేయవచ్చు, కాని, అలా చేస్తే, మనం కూడా వారి 'లాస్ట్ సీన్' చూసే అవకాసం కోల్పొతాము. అయితే, చూస్తె నాకేమి గాక, అనే దృక్పదం తో మన దేశం లో వాట్సాప్ వినియోగం రోజు రోజు కి ఘననీయంగా పెరుగుతుంది.
.
వాట్సాప్ లో ఉన్న సదుపాయాలు చాలానే, అందుకే కాబోలు మనం ఈ అప్ ని ఎంతగానో ప్రేమిస్తాము, ఇంతే కాదండోయ్ ఇప్పటికిది ఫ్రీ ఆప్ కాబట్టి ఇది మరీ ప్రీతిపాత్రము. వాట్సాప్ లో ఉన్న ఇంకొక ప్రత్యేకత 'ఎమోటికాన్స్' (హావభావచిత్రం) వివిధ రకములుగా ఉంటాయి. హావభావాలు (నవ్వు, కోపం, చిద్విలాసం, ఏడుపు, నిద్ర, ముద్దు, ప్రేమ, ఇంకా ఎన్నో) మొదలుకొని, జాతీయ జెండాలు (మొదట భారత జెండా ఉండేది కాదు, మన వాడకాని మన్నించి, మన జెండా కూడా చేర్చారు), నిత్యం ఉపయోగించే వస్తువులు అన్ని చిత్ర రూపంలో మనకు అందుబాటులో ఉంటాయి. వీటిల్ని మనం పదములకు బదులుగా వాడుకో వచ్చు.
ఈ మధ్య నే ప్రవేశ పెట్టిన ఇంకొక సదుపాయం, మన చర్మ చాయ ని బట్టి మనం కొన్ని ఎమోటికాన్స్ ని, మనకు పసందయిన ఛాయ ని వాడుకోవచ్చు.
వాట్సాప్ లో ఉన్న సదుపాయాల్ని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం :
భాతాఖాని ( చాటింగ్ ): ఒకప్పుడు ఎస్ ఎం ఎస్ ద్వారా పంపుతున్న సమాచారాన్నే కాకుండా, ఈ మెయిల్ ద్వారా పంపే సమాచారాన్ని కూడా ఇప్పుడు మనం
వాట్సాప్ ద్వారా పంపుతున్నాము. ఇదే కాకుండా, హావభావ చిత్రముల ద్వారా మన భావనలు (ఫీలింగ్స్) తెలియ చేస్తున్నాము. ఇంతే కాదండోయ్, కొంత మంది ఔత్సాహిక కారులు ఈ ఎమోటికాన్స్ ని వాడి, క్విజ్ మరియు పజిల్స్ కూడా తయారు చేస్తున్నారు, మన సమయాన్ని వీటిపై వెచ్చిస్తు మనం మన మెదడు కు కూడా పని పెడుతున్నాము. వాట్సాప్ లో ఎమోటికాన్స్ ప్రసిద్ది పొందాకే మిగతా వాటిల్లో (ఫేస్బుక్, వైబర్ మొ॥) కూడా వాటిని ప్రవేశ పెట్టడం జరిగింది
చాయచిత్రం (ఫోటో):
వాట్సాప్ ద్వారా 70 కోట్ల ఫోటోలు ప్రతి రోజు మన స్మార్ట్ ఫోన్స్ కి చేరుతున్నాయి అంటే అతిశయోక్తి కాదండోయ్! ఎటువంటి చిత్రాలు అంటే అది మీ ఊహకే వదిలేస్తున్ననండి, అప్పుడె పుట్టిన పాపాయి నుండి పెళ్లి ఫొటోలవరకు, కార్టూన్ చిత్రాలు మొదలుకొని, శుభోదయం (గుడ్ మార్నింగ్) అని పూలతో కూర్చిన చిత్రాల వరకు. మన వాళ్ళు దేవుడి బొమ్మలు పంపడమే కాదు, వాటిని ఇతరులకు పంపకపోతే అనర్ధం అని బెదిరింపో / అభ్యర్ధనో తెలియని విధంగా అవి తిరిగి మనం ఇతరులకు పంపే రీతిలో ఉంటాయి. ష్ ... ఇవే కాదండి శృంగార భంగిమలు కూడా విపరీతంగా వాట్సాప్ ద్వారా మార్పిడి చేసుకుంటారు
లఘు చిత్రాలు (వీడియో): కాపీ చట్టం ఉల్లంఘించకుండా ఎక్కడయినా చీకు చింతా లేకుండా వీడియోలను పంచు కోవాలి (షేరింగ్) అంటే అది
వాట్సాప్ లోనే సాధ్యము. కాని ఈ షేరింగ్ కి కొన్ని ఫైల్ సైజ్ (ఎం బిస్) నిషిద్ధాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ నిబందనలో కూడా సడలింపు ఉండే అవకాశాలు ఉన్నాయి. రియాల్టి షో లు, వార్తా క్లిప్పింగులు , శృంగార చిత్రాలు, గురు భోదనలు, పాఠాలు ఇటు వంటివి ఎన్నో వాట్సాప్ ద్వారా ప్రతి రోజు మార్పిడి జరగడం చూస్తున్నాము. చింతించవలసిన విషయం ఏమిటంటే, కంప్యూటర్ మాదిరి ఇక్కడ ఎటువంటి నిరోధకాలు (పెరంటల్ కంట్రోల్) అమలు చేయలేము, అందు వల్ల యువత మరియు పిల్లలు ఈ శృంగార చిత్రాలు చూడకుండా నిరొదించలెము, ఇది ఒక ప్రమాదకరమైన పరిస్తితి.
శబ్ద సందేశం (వాయిస్ చాట్ ): 'వీచాట్' అనే ఒక ఆప్ ఈ వాయిస్ చాట్ మూలంగానే మన దేశం లో కొంత మంది వాడకందారులని పొందకలిగింది. ఎప్పుడైతే
వాట్సాప్ లో ఈ సదుపాయం కలుగాచేసారో వీచాట్ తన ప్రాముక్యతను కోల్పోయింది. ఈ సదుపాయం పిల్లల చే మాట్లాడించడానికి లేదా వారి చే ధన్యవాదాలు (తాంక్స్) చెప్పించేందుకు మరియు పెద్దల చేత మాట్లాడించేందుకు (స్మార్ట్ ఫోన్ లో టైపు చేయలేని వారికి) వాడుకోవచ్చు. ఇప్పుడు ఛాలా పాటల మరియు శబ్ద పోటీల లో పాల్గొనే వారిని ఈ సదుపాయాన్ని ఉపయోగించి వారి సామర్ద్యతను నిరూపించు కోమని ప్రకటనలు వింటుంటాము.
సమూహము (గ్రూప్): ఫేస్బుక్ మాదిరి కాకుండా వాట్సాప్ గ్రూప్ లో మన సన్నిహితులతో చిటికెలో సంభాషిన్చుకోవచ్చు, కంప్యూటర్ ముందు కూర్చొనే పనిలేదు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నా మన స్మార్ట్ ఫోన్ ద్వారా ఏక చెక్కా, మనకు కావాల్సిన వాళ్ళందరితో ఒకే సారి భాతాఖాణి వేయవచ్చు. ఈ సమూహాలని మనకు ఇష్టం వచ్చిన రీతిలో మనం ఏర్పరుచుకోవచ్చు. కుటుంబం (ఫ్యామిలి), స్నేహితులు, సహా విద్యార్దులు , సహోద్యోగులు, సంఘ సభ్యులు, ఇలా ఎన్నెన్నో రకాలుగా ఇప్పుడు గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు, ఈ మధ్య కాలంలో నేనే కొన్ని, కుటుంబ, సహా విద్యార్ధుల (ఆలుమ్నై) గ్రూపులు ఏర్పరిచాను, అతి తొందరలో మా ఆలుమ్నై తో ఒక రీయూనియన్ కూడా జరుపుకోబోతున్నాము. ఒక విధంగా చెప్పాలంటే కాల గమనం లో విడిపోయిన వారిని కలుపు కొనేందుకు ఈ సదుపాయం బాగా ఉపయోగపడుతోంది.
మంచి తో పాటు చెడు కూడా ఉంటుంది కదండి , కొంత మంది ఈ గ్రూపుల ద్వారా వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి ప్రయత్నిస్తారు, అటు వంటి వారిని నిషేధించడం తప్ప మనం చేయగల్గింది ఏది లెదు. ఇక్కడ ముఖ్యంగా గ్రహించ వలసిన విషయం ఏమిటి అంటే, ఒకే విధమైన్ భావాలు/ అనుభందం లేని వారిని ఒక గ్రూప్ లో ఉంచడానికి ప్రయత్నం చేయకూడదు. ఇప్పట్లో ఒక గ్రూప్ లో 100 మంది సభ్యుల కంటే ఎక్కువ ఉంచలేము.
విస్తృత ప్రసారం (బ్రాడ్కాస్ట్): ఈ సదుపాయం మన మిత్రులకి ఒక్కసారిగా ఒకే విషయాన్ని తెలియచేయాలి అంటే ఉపయోగించవచ్చు. 256 మంది వరకు ఒక్క సారిగా మనం సందేశం పంపవచ్చు. ఇది పెళ్లి సమాచారం, పుట్టిన రోజు ఆహ్వానం లేదా ఏదైనా అందరికి సంబందించిన వార్త లేదా చిత్రం (పిక్చరు) పంపవచ్చు. కాని ఈ వార్త మనం పంపే వారి ఫోన్ కి చేరాలి అంటే, మన నంబరు వారి పరిచయ జాబితా (కాంటాక్ట్ లిస్టు) లో నమోదు అయ్యి ఉండాలి. అలా లేని పరిస్తితిలో ఆ సందేశం వారికి చేరదు. ఇది ఒక మంచి పరిమితి (రెస్ట్రిక్షన్), ఎందుకు అంటే మన ఫోన్ కి స్పామ్ రాకుండా నివారించడానికి వీలవుతుంది. బ్రాడ్కాస్ట్ ద్వారా పంపిన సందేశాల నివేదిక మనకి , , వెళ్ళింది ఎదుటివారికి చేరింది వారు చదివారు ద్వారా తెలియచేయ బడుతుంది
.
వెబ్.వాట్సాప్.కామ్ (Web.whatsapp.com): వాట్సాప్ వెబ్ సైట్ కి వెళ్ళాము అంటే అక్కడ మనకు ఈ లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ వల్ల మన స్మార్ట్ ఫోన్ మరియు లాప్టాప్ లేదా కంప్యుటర్ అనుసానింపబడుతాయి. మన ఫోన్ లో వచ్చే సందేశాలను మనం కంప్యుటర్ లో చూసి అక్కడి నుంచే బదులు ఇవ్వడానికి వీలు అవుతుంది. ఈ సదుపాయం పని చేయడానికి మన ఫోన్ మరియు కంప్యుటర్, వై ఫై ద్వారా పనిచేస్తుండాలి. ఇది ఆఫీసులో ఫోన్ వాడకం వీలు లేనప్పుడు వాడేందుకు బాగా ఉపయోగపడుతుంది.
ఈ
వాట్సాప్ వాడకం ఎంతగా పెరిగింది అంటే, ఈ రోజుల్లో వయసు మళ్ళిన వారు (సీనియర్ సిటిజన్) కూడా సులభంగా వాదెస్తున్నరు. నా 74 సం॥ ల వయసు తల్లి తన చీరల వ్యాపారానికి వాట్సాప్ వాడుతుంది. కొత్త డిజయిన్ చీరల ఫోటో లు దుకాణదారుడు పంపితే వాటిని చూసి అర్డర్ పెట్టడం అలాగే తన కస్టమర్లకు కొత్త చీరల పిక్చర్ తీసి పంపడం ఇలా సునాయాసంగా జరిగి పోతుంది. ఇలాగే పెళ్లి సంభందాలు జాతకాలు, బయో డాటాలు, ఫోటోలు అన్ని వాట్సాప్ లో పంపించి, తాళి కట్టడం తప్పించి అన్ని జరిగిపోతున్నాయి. మెడికల్ రిపోర్టులు, ఎక్సరే బొమ్మలు కూడా సునాయాసంగా వాట్సాప్ ద్వారా పంపి వైద్య సలహాలు పొందడం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో మనం వినుటు ఉంటాము " ఫోటో తీసి వాట్సాప్ చెయ్యి" అని.
వాట్సాప్ మూలంగా ఇప్పుడు రతికేళి (సెక్స్ వీడియోలు) చూడడం బాగా పెరిగింది. అరచేతిలో ఫోన్ పెట్టుకొని మనకు అనుకూలమైన ప్రాంతములో కూర్చొని, వంటరిగానో, జంటగానో, మిత్రులతోనో, ఈ వీక్షణ బాగా పెరిగింది. ఇది చిన్న పిల్లల దగ్గర నుండి యుక్త వయస్కులలో మితి మీరిన వ్యవహారంగా మరిన్ది. అడ్డు ఆపు లేని మన దేశం లో ఈ ఒరవడి కొంచం చేటు కు దారి తీసే అవకాశం జాస్తి గా ఉన్నది.
చెప్పుకో దగ్గ విషయం ఏమిటి అంటే, వాట్సాప్ తన వినియోగ దారుల పట్ల చాల భాద్యతతో వ్యవహరిస్తుంది. ఈ వాట్సాప్ గ్రూపులు ప్రారంబం అయ్యాక, మన బాతాఖాణి అలవాటు వల్ల మన బందు మిత్రులు విదేశాలలో ఉండె వారికి (టైం డిఫరెన్స్) నిద్ర చెడగొట్టే రకంగా సందేశ అగమన (నోటిఫికేషన్ ) శబ్దం తో ఇబ్బంది పడే వాళ్ళు. కొంత మంది అయితే గ్రూపు లో నుంచి నిష్క్రమణ అయ్యే వాళ్ళు . ఇప్పుడు కొత్త సౌజన్యంతో ఈ నోటిఫికేషన్ ని మనం నిశ్శబ్దం (మ్యూట్ ) చేయవచ్చు.
ఇదే తరహాలో వాట్సాప్ ఆప్ ని దుర్వినియోగ పరచడం సమర్దించదు. మనం ఏదైనా ఒక సందేశాన్ని మన నంబరు వారి పరిచయ జాబితా లో లేని చాలా మందికి పంపేందుకు ప్రయత్నిస్తే, ముందు ఒక 4 గం॥ ల మనం వాట్సాప్ ఆప్ ని వాడకుండా నిషేదిస్తుంది, తరువాత కూడా, అదే విధంగా ప్రవర్తిస్తే మన వాదాకాన్ని పూర్తిగా నిరోదిస్తుంది. అందు కనే కాబోలు, మనకి ఎక్కువగా వాట్సాప్ మూలంగా పెద్దగా ఈ స్పామ్ సందేశాలు రావు.
ఈ నా ప్రయత్నం
వాట్సాప్ ను వాడుతూ దాని లోని సదుపాయాల గురించి పూర్తిగా తెలియని వారికి తెలియచేయడం. నా తరువాతి వ్యాసం లో వాట్సాప్ లోని ఎమోటికాన్స్ గురించి తెలుసుకుందాము , ఇక సెలవు మరి.
మీకు ఈ వ్యాసం నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయడం ద్వారా గాని ట్వీట్ ద్వారాగాని తెలుప వచ్చు