Showing posts with label నారా చంద్రబాబు. Show all posts
Showing posts with label నారా చంద్రబాబు. Show all posts

Friday, October 23, 2015

మోడీ గారి శంఖుస్తాపన

అమరావతి కి తెచ్చావు మట్టి పార్లమెంటు ప్రాంగణం నుంచి
కానీ కొట్టావు మా ఆశల పై నీళ్ళు యమున లో మరీ ముంచి

హోదా  పై లేదు ఒక్క మాట, ప్యాకేజి ఎందుకు ఆంధ్రులకు
చెప్తాను నాలుగు మంచి మాటలు, అన్నావు, వినండి నా  ఆంధ్రులు

మీరు చాలా సమర్ధులు , ప్రారంబించండి స్టార్టప్పులు
మీ ముఖ్యమంత్రి తేగలడు ఎన్నైనా అప్పులు

మాయమాటలు విని మోస పోకండి నా ఆంధ్ర యువతా
నా కంటే ఎవరు చెప్పగలరు మీకు తియ్యటి మాటలు ఆంధ్ర జనతా

మీరు నమ్మండి మీ శ్రేయస్సు కోరే వెంకయ్యను
ఆత ను గీసిన గీత దాటని చంద్రయ్యను

చింత లేదు మీ పై నాకు ఎందుకంటే లేవుకదా దగ్గరలో ఎన్నికలు
ఎక్కడ ఎక్కడ నా మంచి   మిత్రుడు, ఓహో లేవుకదా దగ్గరలో ఎన్నికలు

నన్ను ప్రశ్నించకు మిత్రమా, నాకు లేదు టైము సమాధానాలకి
చేయాలి టూర్ లు మరెన్నో దేశాలు, కావాలి వేదికలు వాగ్దానాలకి

సెలవు మరి ఆంధ్రులారా, భారత్ మాతా కి జై